
సాంప్రదాయాల నేపథ్యంలో జరుగుతుంది.ఎన్నికల్లో గెలవటానికి కోట పాత్ర పడే పాట్లు నవ్వుతెప్పిస్తుంది.అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా జగ్గయ్యని ఇమిటేట్ చేస్తూ చెప్పే డైలాగులు కూడా మనల్ని నవ్విస్తాయి.ఐ.జి.గా చలపతిరావు,చికెన్ తినే పంతులుగా రఘుబాబు,కాంతారావు బావలుగా కృష్ణ భగవాన్,శ్రీనివాసరెడ్డి,వేణు మాధవ్,యస్.ఐ.గా జీవా తదితరులు వాళ్ల వాళ్ళ పాత్రల పరిథి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.హీరో నరేష్ తన పాత్రను యధాశక్తి బాగా పోషించాడు.ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన
పిండి.ఇలాంటి పాత్రల్లో అతను గతంలో చాలా సినిమాల్లో నటించాడు.ఇక కామ్నా జెఠ్మలానీ తన పాత్రకు బాగానే న్యాయం చేసింది.ఈ
చిత్రం నిర్మాణపు విలువలు బాగున్నాయి.>సంగీతం- గాయకుడు మల్లికార్జున్ కిది సంగీత దర్శకుడిగా తొలి చిత్రం.ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా లేకపోయినా చండాలంగా
మాత్రం లేవు.కానీ కొన్ని ట్యూన్లు ఎక్కడో విన్నట్టుగా ఉంటాయి.ముఖ్యంగా "చందమామ"చిత్రంలోని "సక్కుబాయినే" అనే పాట
మోడల్లో ఈ చిత్రంలోని ఒక పాట ఉండటం విశేషం.ఇక రీ-రికార్డింగ్ కూడా బాగుంది.
సినిమాటోగ్రఫీ - ఈ చిత్రంలోని కేమెరా వర్క్ బాగుంది.కళ్ళకు ఏమాత్రం శ్రమ లేకుండా ఈ చిత్రంలోని ఫొటోగ్రఫీ ఉంది.
మాటలు - ప్రసాద వర్మ మాటలు యావరేజ్ గా ఉన్నా అక్కడక్కడా కొన్ని పంచ్ లు పేలాయి.
పాటలు - వనమాలి, రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పాటల్లో సాహిత్యం ఫరవాలేదు.అర్థమవుతోంది.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - ఒ.కె.
కొరియోగ్రఫీ - ఫరవాలేదు.
|